పఠాన్ చారిత్రాత్మక సక్సెస్‌ని రిజిస్టర్ చేసుకున్నాక, నిర్మాణ సంస్థ యష్‌రాజ్ ఫిల్మ్స్ ఇప్పుడు తదుపరి సినిమాల మీద సీరియస్‌గా ఫోకస్ చేస్తోంది. లైనప్‌లో ఉన్న సినిమాలకు డెడ్‌లైన్ విధిస్తోంది. పఠాన్ 1050 కోట్లు కలెక్ట్ చేసి బెస్ట్ ఎగ్జాంపుల్‌గా నిలిచింది. స్పై యూనివర్శ్‌ని గురి చూసి కొడితే కోట్లు రాలుతాయని మరోసారి ప్రూవ్ అయిందని అంటున్నారు మేకర్స్.
* త్వరలోనే టైగర్ 3
సల్మాన్‌ఖాన్, కత్రినాకైఫ్ నటిస్తున్న సినిమా టైగర్3. ఈ సినిమాలోనే షారుఖ్ గెస్ట్ రోల్ చేసేది. మనీష్ శర్మ డైరక్ట్ చేస్తున్నారు. ఈ ఏడాది దీపావళికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై సినిమాల వరుసలో టైగర్ 3 విడుదలకు సిద్ధమవుతోంది. యష్‌రాజ్ ఫిల్మ్స్ లో స్పై యూనివర్శ్‌కి నాంది పలికింది ఈ సీరీస్‌తోనే. అందులో టైగర్3 సక్సెస్ ఇప్పుడు ఈ సంస్థకు చాలా కీలకం.
టైగర్3 ముగింపుతో.. వార్2 మొదలు
హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించిన సినిమా వార్. ఈ సినిమాను సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించారు. 2019లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో 400 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ సిద్ధమవుతోంది. అయాన్ ముఖర్జీ ఈ సీక్వెల్‌ని డైరక్ట్ చేయబోతున్నారు. కబీర్ పాత్రలో నటించడానికి హృతిక్ ఆల్రెడీ ఓకే చెప్పేశారు. టైగర్3 క్లైమాక్స్ కీ, వార్2 స్టార్టింగ్ పాయింట్‌కీ కనెక్షన్ ఉండబోతుందన్నది లేటెస్ట్ న్యూస్. 2024లోగానీ, 2025 జనవరిలోగానీ వార్2ని రిలీజ్ చేయాలన్నది ప్లాన్. యష్‌రాజ్ ఫిల్మ్స్ లో ఇప్పటిదాకా తెరకెక్కిన స్పై సినిమాలకు వంద శాతం సక్సెస్ రేషియో ఉంది. ఇదే హిట్ బొనాంజాను 2025వరకు కొనసాగించి చూపిస్తామని అంటున్నారు మేకర్స్.